Dharmavaram: క్యూ లైన్ల బాధ తప్పింది.. మంత్రి చొరవకు ప్రశంసలు

Dharmavaram: ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం ఆన్‌లైన్ ఓపీ విధానం ప్రారంభం. మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో ఆసుపత్రిలో షెడ్లు, బెంచీల ఏర్పాటు.

PAMALA NAGENDRA, DHARMAVARAM
Published on: 6 May 2026 4:37 PM IST
Dharmavaram
X

Dharmavaram: క్యూ లైన్ల బాధ తప్పింది.. మంత్రి చొరవకు ప్రశంసలు

Dharmavaram: ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొన్ని సంవత్సరాలుగా ఓపీ సేవల కోసం వచ్చే రోగులు క్యూ లైన్లలో నిలబడి ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి గారు గమనించారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎండలో, వర్షంలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉన్నదని గుర్తించి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని సంకల్పించారు.

ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఓపీ సేవలను ఆన్లైన్ విధానంలో ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. దీని వల్ల రోగులు ముందుగానే తమ టోకెన్ లేదా సమయం బుక్ చేసుకునే సౌకర్యం కలిగి, ఆసుపత్రికి వచ్చిన తర్వాత ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం తగ్గింది.

అదేవిధంగా ఆసుపత్రి ప్రాంగణంలో రోగులు సౌకర్యంగా వేచి ఉండేందుకు ప్రత్యేకంగా షెడ్ నిర్మాణం చెయ్యేస్తున్నారు. ఎండ, వర్షం వంటి వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణ కల్పించేలా ఈ షెడ్ ఉపయోగపడుతుంది . ఇంకా, కూర్చొని విశ్రాంతి తీసుకునేందుకు నాలుగు సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేయేస్తున్నారు.

ఈ చర్యలు రోగుల పట్ల మంత్రి గారి మనసున్న నాయకత్వాన్ని ప్రతిబింబిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను మరింత ప్రజలకు అనుకూలంగా మార్చే దిశగా కీలక అడుగుగా నిలిచాయి. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పును తీసుకువస్తూ, ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత బలపరుస్తున్నాయి.

PAMALA NAGENDRA, DHARMAVARAM

PAMALA NAGENDRA, DHARMAVARAM