Mudigubba: ముదిగుబ్బ పీహెచ్సీకి ₹1.69 కోట్లు.. మంత్రి సత్యకుమార్ చర్య

Mudigubba: ముదిగుబ్బలో అసంపూర్తి పీహెచ్సీ భవనానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ రూ.1.69 కోట్లు మంజూరు. త్వరలో పనులు ప్రారంభం.

S.Firoz, Sri Sathya Sai
Published on: 21 April 2026 10:38 AM IST
Mudigubba
X

Mudigubba

Mudigubba: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండల ప్రజలకు ఇచ్చిన హామీని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నెరవేర్చారు. ముదిగుబ్బలో అసంపూర్తిగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) భవనం పూర్తి చేయడానికి రూ.1.69 కోట్ల నిధులను మంజూరు చేశారు.

2024 సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ పీహెచ్సీ భవనాన్ని పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు నిధులను విడుదల చేయించారు.

అధికారుల ప్రకారం, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించి, పీహెచ్సీ భవనాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నిర్ణయం ముదిగుబ్బ మండల ప్రజలకు ఆరోగ్య సేవలను మరింత చేరువ చేయనుంది.

S.Firoz, Sri Sathya Sai

S.Firoz, Sri Sathya Sai

Next Story