Anantapur: అనంతపురంలో మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు

Anantapur: అనంతపురం వేదికగా వైఎస్ జగన్ డైవర్షన్ పాలిటిక్స్‌పై మంత్రి సవిత తీవ్ర నిప్పులు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 31 May 2026 5:00 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు

అనంతపూర్: డీఎస్సీ గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనంతపురంలోని కనకదాస కల్యాణ మండపంలో పదో తరగతిలో ఉత్తమ మార్కుల కనపరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధాన ఉత్సవంలో ఆమె పాల్గొన్నారు. విద్యార్థులకు బహుమతులు అందించి, మంచి లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని చదువులో రాణించాలని చెప్పారు.

ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పిన జగన్ గతంలో ప్రజలను యువతను మోసం చేశారన్నారు. ఇవాళ డీఎస్సీ నిర్వహణలో సిబిఐ విచారణ చేయాలని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు సిబిఐ అంటే ఏమిటో జగన్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా, మద్యం షాపుల వద్ద విధులు నిర్వహించేలా చేసిన అంశాలను గుర్తించుకోవాలన్నారు.

గొడ్డలి పార్టీని పెట్టుకుని ప్రజలను హింసించడం, దౌర్జన్యాలు చేయడమే ఆ పార్టీ ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంతో పాటు మంత్రి నారా లోకేష్ చొరవతో ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పిస్తే, జగన్ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలతో రాజకీయం చేయాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story