Penukonda: అడిగిన గంటలోనే దివ్యాంగులకు ట్రైసైకిళ్లు అందించిన మంత్రి సవితమ్మ!
Penukonda: పెనుకొండలో దివ్యాంగులు కోరిన గంట వ్యవధిలోనే మంత్రి సవితమ్మ ట్రైసైకిళ్లు అందజేశారు.
Penukonda: అడిగిన గంటలోనే దివ్యాంగులకు ట్రైసైకిళ్లు అందించిన మంత్రి సవితమ్మ!
పెనుకొండ: పెనుకొండ మండలం వెంకటగిరిపాళ్యం గ్రామానికి చెందిన దివ్యాంగులు వడ్డే శ్రీరాములు, చాకలి ముత్యాలప్ప తమ కష్టాలను తెలియజేస్తూ ట్రైసైకిళ్లు కావాలని బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవితమ్మని కోరారు. వారి అభ్యర్థనపై మంత్రి సవితమ్మ వెంటనే స్పందించి, వారు కోరిన గంట వ్యవధిలోనే ఉచితంగా ట్రైసైకిళ్లను అందజేశారు.
ట్రైసైకిళ్లు అందుకున్న సందర్భంగా వారి ముఖాల్లో కనిపించిన ఆనందం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని మంత్రి సవితమ్మ తెలిపారు.పేదలు, దివ్యాంగుల సంక్షేమం, వారి ఆత్మగౌరవం, సాధికారత కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అవసరమైన సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.దివ్యాంగులు స్వావలంబనతో జీవించేలా వారికి అవసరమైన సహాయాన్ని అందించడం తమ ప్రభుత్వ బాధ్యతగా భావిస్తోందని మంత్రి సవితమ్మ పేర్కొన్నారు.




