Anantapur: అనంతపురంలో కూటమి విజయోత్సవ సభ.. హాజరైన మంత్రులు

Anantapur: అనంతపురం జిల్లా కేంద్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ విజయోత్సవ సభ జరిగింది.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 19 Jun 2026 5:42 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో కూటమి విజయోత్సవ సభ.. హాజరైన మంత్రులు

అనంతపూర్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా కేంద్రంలో విజయోత్సవ సభ ఘనంగా ప్రారంభమైంది. కూటమి సాధించిన విజయాలు, ప్రజా సంక్షేమ పాలనకు నిదర్శనంగా ఈ సభను భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ విజయగర్జన సభకు జిల్లా నలుమూలల నుంచి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఈ చారిత్రాత్మక విజయోత్సవ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు హాజరయ్యారు. వారితో పాటు ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, బండారు శ్రావణి శ్రీ, కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, మరియు కూటమి పార్టీల ముఖ్య నేతలు వేదికను అలంకరించారు.

రెండేళ్ల కాలంలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని, ప్రజల్లోకి తీసుకెళ్లిన సంక్షేమ పథకాలను నేతలు ఈ సందర్భంగా కొనియాడారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటుచేసిన శ్రీ శక్తి ఉచిత బస్సు టికెట్ తీసుకున్న ఎమ్మెల్యే బండారి శ్రావణి, అదేవిధంగా సభ ప్రాంగణం వద్ద ఏర్పాటుచేసిన స్టాల్స్ ని పరిశీలించిన మంత్రులు ఎమ్మెల్యేలు.

ప్రత్యేక ఆకర్షణ జేసీ ప్రభాకర్ రెడ్డి మార్క్ జోష్!

ఈ సభలో అన్నిటికంటే ముఖ్యంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతూ ఆయన వేదిక కింద వేసిన స్టెప్పులు సభకు హైలైట్‌గా నిలిచాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి డ్యాన్స్ చేయడంతో కార్యకర్తలు ఈలలు, కేకలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు.

కూటమి పార్టీల శ్రేణుల మధ్య అపూర్వమైన సమన్వయం, కార్యకర్తల కోలాహలంతో అనంతపురంలో నిర్వహించిన ఈ విజయోత్సవ సభ వంద శాతం విజయవంతమైంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలో దూసుకుపోతామని జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story