Kalyandurgam: ఆంధ్ర అరుణాచలం కుందుర్పి కొండ వద్ద మొక్కల ప్రదక్షిణ!
Kalyandurgam: ఆంధ్ర అరుణాచలంగా పేరొందిన కుందుర్పి కొండ గిరి ప్రదక్షిణ, మొక్కలు నాటే కార్యక్రమ పోస్టర్‌ను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆవిష్కరించారు.
Kalyandurgam: ఆంధ్ర అరుణాచలం కుందుర్పి కొండ వద్ద మొక్కల ప్రదక్షిణ!
కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి మండలంలో ‘ఆంధ్ర అరుణాచలం’గా ప్రసిద్ధి చెందిన కుందుర్పి కొండ గిరి ప్రదక్షిణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు శనివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమన్నారు. “కేవలం గిరి ప్రదక్షిణ కాదు.. చేతిలో ఒక మొక్కను తీసుకుని ప్రదక్షిణ చేసి, అనంతరం ఆ మొక్కను నాటాలి” అనే వినూత్న కార్యక్రమంలో భక్తులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
భక్తి భావనతో పాటు ప్రకృతి పరిరక్షణను కలగలిపిన ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెంచవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే ప్రతి ఒక్కరూ మొక్కను నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు చౌలం మల్లికార్జున, డిస్కవరీ ఛానల్ అనిల్, బీజేపీ తాలూకా కో-కన్వీనర్ గంగాధర్, మాజీ ఎంపీటీసీ మల్లికార్జున, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు తాహిర్, మార్కెట్ యార్డు డైరెక్టర్ వై.బి. ఓభయ్య, టీడీపీ మాజీ బూత్ కన్వీనర్ గొల్లపల్లి ప్రసాద్, ఎర్రగుంట ఆనంద్, అమరావతి నారప్ప, టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడు మహేష్, ఐటీడీపీ కో-కన్వీనర్ మఠం అనిల్ తదితరులు పాల్గొన్నారు. కుందుర్పి మండల ప్రజలు, పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.




