Tirupati: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు!
Tirupati: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు.
Tirupati: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు!
Tirupati: తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు ఎస్సార్సీ చైర్మన్ ముత్తినేని రాజగోపాల్, దేవినేని వెంకటేష్, మహీధర్ తదితరులు పాల్గొన్నారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల ఆయురారోగ్యాల కోసం ఎమ్మెల్యే ప్రార్థనలు చేశారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందించారు. దర్శనం అనంతరం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మరియు వారి బృందం తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భోజనం చేశారు. భక్తులతో కలిసి సాధారణంగా భోజనం చేయడం ఆనందంగా అనిపించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భక్తులందరికీ శ్రీవారి కృప ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.




