Kadiri: ప్రతి సమస్య పరిష్కారం అయ్యే వరకు తగ్గేదే లేదు ఎమ్మెల్యే!

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి 34వ వార్డు రామస్వామి గుడి వద్ద ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన ప్రజా దర్బార్ లో ప్రజల నుండి హౌసింగ్, పెన్షన్ల వినతులు స్వీకరించారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 22 July 2026 10:14 PM IST
Kadiri
X

Kadiri: ప్రతి సమస్య పరిష్కారం అయ్యే వరకు తగ్గేదే లేదు ఎమ్మెల్యే!

కదిరి: సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని 34వ వార్డు రామస్వామి గుడి వద్ద బుధవారం నిర్వహించిన *'ప్రజా దర్బార్'* కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రజలు ఇళ్ల నిర్మాణం (హౌసింగ్), పెన్షన్లు, విద్యుత్ సౌకర్యం, తాగునీటి సమస్యలు, డ్రైనేజీ, రోడ్లు, ఇతర మౌలిక వసతులు తదితర అంశాలపై వినతిపత్రాలను సమర్పించారు.

వినతులను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత శాఖల అధికారులతో అక్కడికక్కడే ఫోన్‌లో మాట్లాడి, సాధ్యమైనంత వరకు పలు సమస్యలకు తక్షణ పరిష్కారం చూపించారు. దీర్ఘకాలిక సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని, వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లడం, ప్రతి కుటుంబ సమస్యను వినడం, ప్రతి సమస్యకు పరిష్కారం చూపడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా నిరంతరం అందుబాటులో ఉంటూ, ప్రతి సమస్య పరిష్కారమయ్యే వరకు నా కృషి కొనసాగుతుందని అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజాకేంద్రిత పాలనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ప్రజా దర్బార్ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story