Anantapur: ఉదయం 6 గంటలకే మైదానంలో ఎమ్మెల్యే.. విద్యార్థులకు సర్ప్రైజ్!
Anantapur: అనంతపురం పీటీసీ మైదానంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మిక తనిఖీ. సమ్మర్ క్యాంప్ విద్యార్థులు, వాకర్స్‌తో ముచ్చటించిన ఎమ్మెల్యే.
Anantapur: ఉదయం 6 గంటలకే మైదానంలో ఎమ్మెల్యే.. విద్యార్థులకు సర్ప్రైజ్!
Anantapur: అనంతపురం నగరంలోని పీటీసీ మైదానంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 6 గంటలకే పీటీసీ మైదానానికి చేరుకున్న ఎమ్మెల్యే, ప్రభుత్వం మరియు శాప్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందిస్తున్న క్రీడా శిక్షణను పరిశీలించారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి, కోచ్‌లు ప్రతిరోజూ వస్తున్నారా లేదా అనే విషయంపై ఆరా తీశారు.
అలాగే పీటీసీ మైదానానికి వాకింగ్, యోగా కోసం వచ్చే ప్రజలతో కూడా ఎమ్మెల్యే మాట్లాడారు. మైదానంలో ఉన్న సౌకర్యాలపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవతో సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తోందన్నారు. విద్యార్థులకు పలు క్రీడల్లో నాణ్యమైన శిక్షణ అందుతోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదని తెలిపారు.
ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు విద్యార్థుల ప్రతిభాభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పీటీసీ మైదానానికి ప్రతిరోజూ సుమారు మూడు వేల మంది వాకింగ్, యోగా కోసం వస్తున్నారని చెప్పారు. మైదానంలోని జిమ్ పరికరాలు దెబ్బతిన్నాయని స్థానికులు తమ దృష్టికి తీసుకువచ్చారని, త్వరలోనే వాటి స్థానంలో కొత్త పరికరాలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పీటీసీ మైదానంలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.




