Anantapur: అనంతపురంలో రూ.6.30 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
Anantapur: అనంతపురం అర్బన్లో రూ.6.30 కోట్లతో 12 ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ శంకుస్థాపన చేశారు.
Anantapur: అనంతపురంలో రూ.6.30 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
Anantapur: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు.నగరంలోని 12 ప్రాంతాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఒకేసారి శంకుస్థాపన చేశారు. పీటీసీ గ్రౌండ్ వద్ద 6 కోట్ల 30 లక్షల రూపాయలతో చేపట్టనున్న పనులకు ఎమ్మెల్సీ దళవాయి రమాదేవితో కలిసి భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ..
నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఏ కారణంతోనూ అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నామని వెల్లడించారు.
పీటీసీ మైదానం వద్ద సుమారు 20 నుంచి 22 ఏళ్ల క్రితం నిర్మించిన రహదారి స్థానంలో.. రాంనగర్ ఫ్లైఓవర్ వరకు నూతన రహదారిని నిర్మిస్తున్నట్లు వివరించారు.నగరంలోని పలు ప్రాంతాల్లో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు.గత రెండేళ్లలో సుమారు 1,300 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్యే వెల్లడించారు.
దాదాపు 300 కోట్ల రూపాయలతో రహదారులు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఏడు కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు.




