Anantapur: ఆలమూరు లేఅవుట్‌లో 6 వేల ఇళ్లు ఇస్తామన్న ఎమ్మెల్యే ప్రసాద్!

Anantapur: అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 18 July 2026 9:47 PM IST
Anantapur
X

Anantapur: ఆలమూరు లేఅవుట్‌లో 6 వేల ఇళ్లు ఇస్తామన్న ఎమ్మెల్యే ప్రసాద్!

అనంతపూర్: అనంతపురం సమీపంలోని ఆలమూరు లేఅవుట్ లో 6వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. అర్బన్ టిడిపి కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరితో ఓపికగా మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు 50 సార్లు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఇందులో 1147 అర్జీలు వచ్చాయని.. వీటిలో 90 శాతానికి పైగా పరిష్కారం చూపించినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో ఒక సెంటు స్థలం ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేస్తామని మాటలు చెప్పి మోసం చేశారన్నారు.

ఆలమూరు లేఅవుట్ తో పాటు టిడ్కో ఇళ్లను కూడా త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఈ రెండేళ్లలోనే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు వివరించారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story