Anantapur: ఎవరు అడ్డుకున్నా బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తాం దగ్గుపాటి!

Anantapur: బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యాఖ్య. వైఎస్సార్సీపీ తీరుపై తీవ్ర విమర్శలు.

Praveen, Regional Coordinator -Ananthapuram
Published on: 10 Oct 2026 1:49 PM IST
Anantapur
X

Anantapur: ఎవరు అడ్డుకున్నా బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తాం దగ్గుపాటి!

Anantapur: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కామెంట్స్. ఎవరు అడ్డుకున్న బీసీలకు 34శాతం రిజర్వేషన్ కల్పిస్తాం, బీసీలకు మొదటి నుంచి ప్రాధాన్యం ఇస్తున్న టీడీపీనే, గతంలో 20 నుంచి 34శాతం వరకు బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించారు.

సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అనేక మంది బీసీలకు పదవులు వచ్చాయి, బీసీలకు మొదటి నుంచి ద్రోహం చేసింది గొడ్డలి పార్టీనే, కేవలం అధికారం తన వర్గానికే ఉండాలనుకునే వ్యక్తి జగన్. శంకర్ నారాయణ లాంటి వారు మంత్రి అయినా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 34శాతం రిజర్వేషన్ కు అడ్డుపడుతున్నది వైసీపీనే, హైకోర్టులో అడ్డుపడ్డారు.. మేము సుప్రీం కోర్టుకు వెళ్లాం. అక్కడ కూడా జగన్ అడ్డుపడ్డారు

బీసీలు రాజకీయంగా ఎదగకూడదన్నది జగన్ లక్ష్యం గతంలో బీసీలు ఎమ్మెల్యేలు, మంత్రులైనా వారిని ఎదగనివ్వలేదు. కనీసం వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కేవలం ముగ్గర్ని మాత్రమే దగ్గర పెట్టుకుంటున్నారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను దగ్గరికి కూడా రానివ్వలేదు. చంద్రబాబు నాయుడు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు.

Praveen, Regional Coordinator -Ananthapuram

Praveen, Regional Coordinator -Ananthapuram

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, అనంతపురం సహా ప్రాంతీయ రాజకీయ, సామాజిక పరిణామాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘రీజినల్ కోఆర్డినేటర్’.