Guntakal: గుమ్మనూరు, పూల నాగరాజు కుటుంబాల లగ్నపత్రిక సుముహూర్తం!
Guntakal: ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చిన్న కుమార్తె, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ పూల నాగరాజు కుమారుడి వివాహ లగ్నపత్రిక సుముహూర్త వేడుక గుంతకల్లులో ఘనంగా జరిగింది.
Guntakal: గుమ్మనూరు, పూల నాగరాజు కుటుంబాల లగ్నపత్రిక సుముహూర్తం!
గుంతకల్లు: శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారి చిన్న కుమార్తె మరియు ఆర్టీసీ రీజినల్ చైర్మన్ మరియు అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ పూల నాగరాజు గారి కుమారుడు వివాహ సుముహూర్త లగ్నపత్రిక వ్రాయించు కార్యక్రమం గుంతకల్లు పట్టణం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు గుమ్మనూరు మరియు పూల నాగరాజు గారి కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది .
ఈ సందర్భంగా వేద పండితులు కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించి లగ్నపత్రిక రాయడం జరిగింది ఈ సందర్భంగా ఇరువురి కుటుంబాలు మిఠాయిలు తినిపించుకుని ఘనంగా లగ్న పత్రిక సుముహూర్త కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారుమరియు జిల్లా అధ్యక్షులు శ్రీ పూల నాగరాజు గారు అలాగే ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారి సోదరులు శ్రీ గుమ్మనూరు నారాయణస్వామి గారు మరియు శ్రీ గుమ్మనూరు శ్రీనివాసులు గారు మరియు ఎమ్మెల్యే గారి తనయుడు యువనేత గుత్తి మరియు
పామిడి టిడిపి ఇన్చార్జ్ శ్రీ గుమ్మనూరు ఈశ్వర్ గారు మరియు కార్మిక శాఖ బోర్డు చైర్మన్ శ్రీ వెంకట శివుడు యాదవ్ గారు*మరియు గుమ్మనూరు నారాయణ గారు గుంతకల్లు నియోజకవర్గం కూటమి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరై కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.




