Guntakal: గుంతకల్లు పేదలకు అండగా నిలుస్తున్న సీఎం చంద్రబాబు
Guntakal: గుంతకల్లులో 48 మంది లబ్ధిదారులకు రూ. 18.66 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.
Guntakal: గుంతకల్లు పేదలకు అండగా నిలుస్తున్న సీఎం చంద్రబాబు
గుంతకల్లు: గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు మరియు వారి సోదరుడు గుంతకల్లు మండల ఇంచార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణ స్వామి గారు హాజరు కావడం జరిగినది ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వారికి పేదవారి కుటుంబానికి పెద్ద కొడుకుల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు తెలిపారు.
అలాగే ఈ రోజున గుంతకల్లు నియోజకవర్గం దాదాపు 48 మందికి గాను 18,66,539 రూపాయలు అందించడం జరిగినది అలాగే మన గుంతకల్లు నియోజకవర్గం లో మొత్తం దాదాపుగా 970 మంది గాను 7 కోట్లు రూపాయలు నిరుపేద కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ *ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఆర్థిక సహాయం చేయడం జరిగినది.
సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కుల లబ్ధిదారులు మాట్లాడుతూ గుంతకల్లు నియోజకవర్గం లో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో మన కూటమి ప్రభుత్వం తరఫున ఎవరు పోటీ చేసిన గెలిపించుకొని తీరుతామని అలాగే మన గుంతకల్లు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి బహుమతిగా ఇస్తామని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాము కూటమి ప్రభుత్వానికి మరియు గుమ్మనూరు కుటుంబానికి రుణపడి ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుంతకల్లు నియోజకవర్గం కూటమి నాయకులు కార్యకర్తలు అనుబంధ కమిటీ సభ్యులు మహిళలు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగినది.




