Pamidi: ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గుమ్మనూరు

Pamidi: 16వ వార్డులో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసి, రెండేళ్ల కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Updated on: 1 Aug 2026 9:51 PM IST
Pamidi
X

Pamidi: న్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

పామిడి: అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో 'పేదల సేవ - ఎన్టీఆర్ భరోసా పెన్షన్' పంపిణీ కార్యక్రమం జరిగింది.

గుంతకల్లు నియోజకవర్గ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పామిడి పట్టణం 16వ వార్డు పాండురంగస్వామి వారి దేవాలయం ఏరియాలో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు.

అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం 16వ వార్డులో డోర్ టు డోర్ నిర్వహించి, కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.

ఆయన మాట్లాడుతూ, "ప్రజా సంక్షేమమే ప్రగతి బాట. సూపర్ సిక్స్ పథకాల అమలుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంటికి సూపర్ సిక్స్ హామీలను దశలవారీగా పూర్తి చేస్తున్నాం" అన్నారు.

పెన్షన్ల పెంపు గురించి మాట్లాడుతూ అవ్వాతలు, వికలాంగులు, వితంతువుల గౌరవాన్ని పెంచుతూ పెన్షన్ మొత్తాన్ని పెంచామని, ప్రతి నెల 1వ తేదీనే నేరుగా ఇంటి వద్దే అందిస్తున్నామని తెలిపారు.

రైతన్నకు కొండంత అండగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పెట్టుబడి సహాయం అందిస్తున్నామని, పంటలకు మద్దతు ధర కల్పిస్తూ రైతులకు అండగా నిలిచామని చెప్పారు.

మహిళా సాధికారత కోసం మహాశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధి, ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీతో మహిళల ఆర్థిక భారాన్ని తగ్గించామని అన్నారు.

యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించేందుకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి _Mega DSC_తో పాటు జాబ్ క్యాలెండర్, పరిశ్రమల సాధన ద్వారా యువతకు విస్తృత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు.

ఈ కార్యక్రమంలో పామిడి పట్టణ మరియు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story