Kadiri: కదిరి 40వ వార్డులో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రచారం!

Kadiri: కదిరి 40వ వార్డులో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రచారం. టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి అర్షియా భాను, కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఇంటింటి పర్యటన.

P.RAHAMTULLA, KADIRI
Published on: 25 Oct 2026 12:11 PM IST
Kadiri
X

Kadiri: కదిరి 40వ వార్డులో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రచారం!

Kadiri: కదిరి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తెలుగుదేశం పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి షేక్ అర్షియా భాను, కూటమి కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పట్టణంలోని 40వ వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వార్డులోని వివిధ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

వార్డుల్లో ఇప్పటికే పలు సమస్యలను పరిష్కరించామని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే వార్డుల అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI