Kadiri: పార్టీలకు అతీతంగా సంక్షేమం.. ఎమ్మెల్యే కందికుంట
Kadiri: కదిరి నియోజకవర్గంలో 34 మంది లబ్ధిదారులకు రూ. 17.49 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పంపిణీ చేశారు.
Kadiri: పార్టీలకు అతీతంగా సంక్షేమం.. ఎమ్మెల్యే కందికుంట
Kadiri: కదిరిలో 34 మంది లబ్ధిదారులకు 17 లక్షల 49 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. మీడియా సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కామెంట్స్. గడిచిన 22 నెలల కాలంలో 527 మంది లబ్ధిదారులకు నాలుగు కోట్ల 57 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశాం.
ఎక్కడ వివక్షతకు తావు లేకుండా పార్టీలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తున్నాము. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఇతర పార్టీలకు గాని తటస్థంగా ఉన్న వారికి గాని చెక్కులు అందజేసిన దాఖలాలు లేవు. ఎలక్ట్రికల్ షాక్ తో దెబ్బతిన్న వైసీపీ కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయంతో పాటు రెండు లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించి ఆదుకున్నాము
ప్రజల సేవే పరమాధిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పనిచేస్తున్నాడు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు గ్లోబల్ ప్రచారం చేయడంలో ఆరి తీరాడు. జగన్మోహన్ రెడ్డి అరాచకాలు తట్టుకోలేక ప్రజలు బుద్ధి చెప్పినా ఆయనలో మార్పు రాలేదు.




