Kadiri: కదిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం ఎమ్మెల్యే!
Kadiri: కదిరి పట్టణంలో కాలుష్య నివారణ, పచ్చదనం పెంపొందించేందుకు డివైడర్లపై పూలమొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందికుంట ప్రారంభించారు.
Kadiri: కదిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం ఎమ్మెల్యే!
Kadiri: కదిరి పట్టణంలో కాలుష్య నివారణతో పాటు పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు.
పట్టణ సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా ప్రధాన రహదారులలో ఉన్న డివైడర్లపై పిచ్చిమొక్కల స్థానంలో ఆహ్లాదకరమైన పూల మొక్కలను నాటుతున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, వారి సోషల్ మీడియా వేదికల ద్వారా చేస్తున్న వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే సూచించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, ప్రత్యర్థుల ఊహకు అందని స్థాయిలో కదిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్పష్టం చేశారు.
Next Story




