Kadiri: కదిరిలో సైకిల్ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే వెంకటప్రసాద్
Kadiri: కదిరిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం. సైకిల్ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్.
Kadiri: కదిరిలో సైకిల్ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే వెంకటప్రసాద్
శ్రీ సత్యసాయి జిల్లా: కదిరిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మోటార్ వాహనాల వినియోగాన్ని తగ్గించి సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుందని నాయకులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ అడపాల వీధి మీదుగా మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణానికి చేరుకుంది. అనంతరం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
నేటి నుండి హౌసింగ్ అప్రూవల్ కోసం ప్రతి ఇంటికి ఒక ఏడాది చెట్టును తప్పనిసరి నాటాలని ఆ విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.




