Kadiri: కదిరిలో తిరుమాడ వీధి రోడ్డు విస్తరణ పనులకు భూమి పూజ!

Kadiri: కదిరిలో తిరుమాడ వీధి రోడ్డు విస్తరణ పనులకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ భూమి పూజ. బాధితులకు నష్టపరిహారం చెల్లించి పనులు చేపడతామని వెల్లడి.

P.RAHAMTULLA, KADIRI
Published on: 14 Oct 2026 10:39 AM IST
Kadiri
X

Kadiri: కదిరిలో తిరుమాడ వీధి రోడ్డు విస్తరణ పనులకు భూమి పూజ!

Kadiri: కదిరి పట్టణంలోని తిరుమాడ వీధి రోడ్డు విస్తరణ పనులకు కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎంఎస్ పార్థసారథి, నియోజకవర్గ పరిశీలకులు చెంచయ్య నాయుడు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, ముస్లిం పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ “కదిరి పట్టణ అభివృద్ధిలో రోడ్డు విస్తరణ కీలకమైన భాగం. ఈ పనులపై ఎవరూ అపోహలకు గురికావద్దు. ఎవరు ఎలాంటి ఆటంకాలు సృష్టించినా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి సహకారంతో, ఎవరికీ అన్యాయం జరగకుండా రోడ్డు విస్తరణ పనులు చేపడతాం.

ఎవరినీ బలవంతం చేయం.. ఎవరికీ అన్యాయం జరగనివ్వం! నిబంధనల ప్రకారం నోటీసులు అందించి, ప్రభుత్వ విధివిధానాల మేరకు అర్హులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే సంబంధిత ప్రక్రియను కొనసాగిస్తాం. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, అందరినీ సంప్రదిస్తూ పనులను ముందుకు తీసుకెళ్తాం.

కదిరి పట్టణానికి ఆధ్యాత్మికంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన శ్రీమద్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇస్తాం. దేవస్థానం ఆదాయాన్ని భవిష్యత్తులో రూ.100 కోట్ల స్థాయికి తీసుకెళ్లే దిశగా చర్యలు చేపడతాం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు, ఆతిథ్యం కల్పించి, వారు సంతోషంగా స్వామివారిని దర్శించుకునేలా కదిరిని అభివృద్ధి చేస్తాం.

రానున్న రోజుల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, భూగర్భ విద్యుత్ కేబుళ్ల ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. పట్టణంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతాం. కదిరి అభివృద్ధి మనందరి బాధ్యత. ప్రజల సహకారంతో కదిరిని మరింత అభివృద్ధి చెందిన పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దాం” అని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పెద్దలు, ముస్లిం మత పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI