Kadiri: కదిరిని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం.. ఎమ్మెల్యే

Kadiri: కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పరిధిలోని స్తోత్రాద్రి గిరిప్రదక్షిణ రోడ్డు మార్గ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 21 Jun 2026 12:41 PM IST
Kadiri
X

Kadiri: కదిరిని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం.. ఎమ్మెల్యే

కదిరి: శ్రీ సత్య సాయి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలనే సంకల్పంతో కదిరి శాసన సభ్యులు కందికుంట వెంకటప్రసాద్ నేడు శ్రీవారు కాటమ రాయుడుగా కొండల లక్ష్మీ నారసింహుడుగా వెలసిన స్తోత్రాద్రి పర్వతం వద్ద శ్రీవారి జన్మ నక్షత్రం సందర్భంగా ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజున శ్రీవారి భక్తులు స్తోతాద్రి గిరిప్రదక్షిణలో పాల్గొంటున్న భక్తుల సౌకర్యార్థం ఎమ్మెల్యే వెంకటప్రసాద్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.

శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది అందులో భాగంగానే కదిరి ప్రాంతాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని అందుకు కదిరి కొండ చుట్టూ ఉన్నటువంటి రైతులు , పట్టణ ప్రముఖులు అభివృద్ధి కోసం సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.

పెద్దఎత్తున గిరి ప్రదక్షిణలో పాల్గొనే శ్రీవారి భక్తులు యువకుల ఆకాంక్షలను,హిందూ ధార్మిక సంస్థల మనోగతాన్ని గత సంవత్సరం నుంచి గమనిస్తున్నామని అందుకు అనుగుణంగానే ప్రభుత్వ అధికారుల సహకారంతో గిరి ప్రదక్షిణకు రోడ్డు మార్గం పనులు పూర్తి చేస్తామని కందికుంట వెంకట ప్రసాద్ గారు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమానికి సహకరించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారికి శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కదిరి MRO రెడ్డి శేఖర్ , RDO కళావతి , ఆలయ E.O శ్రీనివాసుల రెడ్డి,ప్రధాన అర్చకులు వసంత నరసింహా చార్యులు, మాజీ శాసన సభ్యులు మిట్టా పార్థసారథి , లక్ష్మణ కుటాల, మిట్టా వంశీ కృష్ణ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు , రెవెన్యూ అధికారులు,ఆలయ అధికారులు, పట్టణ ప్రముఖులు , శ్రీ వారి భక్తులు,శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు,హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు పెద్దయెత్తున పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story