Kadiri: మున్సిపల్ పోరు: కుటాగుళ్ళలో జోరందుకున్న తెలుగుదేశం ప్రచారం

Kadiri: కదిరి మున్సిపాలిటీ 2వ వార్డు టీడీపీ అభ్యర్థి తరిగొండ హమీద్ నివాసానికి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వెళ్ళి, ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేశారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 15 Oct 2026 11:36 AM IST
Kadiri
X

Kadiri: మున్సిపల్ పోరు: కుటాగుళ్ళలో జోరందుకున్న తెలుగుదేశం ప్రచారం

Kadiri: కదిరి 2వ వార్డు టీడీపీ అభ్యర్థి తరిగొండ హమీద్ కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మర్యాదపూర్వక భేటీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీలోని కుటాగుళ్ళ 2వ వార్డు టీడీపీ అభ్యర్థి తరిగొండ హమీద్ కుటుంబ సభ్యులను కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ వారి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని, ప్రజల్లోకి వెళ్లి తెలుగుదేశం పార్టీ ఆశయాలను వివరించి విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు హరి,గంగరాజు,చింత రమణ,నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI