Madakasiri: జక్కేపల్లిలో టీడీపీ మహానాడు ఎల్ఈడీ స్క్రీన్లపై వర్చువల్ వీక్షణ
Madakasiri: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం జక్కేపల్లిలో క్లస్టర్-08 మహానాడు వేడుకలు ఘనంగా జరిగాయి.
Madakasiri: జక్కేపల్లిలో టీడీపీ మహానాడు ఎల్ఈడీ స్క్రీన్లపై వర్చువల్ వీక్షణ
మడకశిర: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం మెలవాయి గ్రామ పంచాయతీ పరిధిలోని జక్కేపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. క్లస్టర్–08 పరిధిలోని ఎనిమిది గ్రామ పంచాయతీలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ అబ్జర్వర్ సుధాకర్ నాయుడు పరిశీలించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.
మడకశిర నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి ఆదేశాల మేరకు ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి జరుగుతున్న మహానాడు ప్రసారాన్ని గ్రామస్థాయిలో అందరికీ చేరవేయాలనే ఉద్దేశంతో జక్కేపల్లిలో ప్రత్యేకంగా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా నాయకులు, కార్యకర్తలు వర్చువల్ మీటింగ్ రూపంలో ప్రసారాన్ని వీక్షించారు.
కార్యక్రమం ప్రారంభంలో టీడీపీ జెండాను ఎగురవేసి, అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. నాయకులు ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుంచిటి వక్కలి కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ మరియు కో-క్లస్టర్ కన్వీనర్ గుండుమల చంద్రప్ప, క్లస్టర్ కన్వీనర్ మురళీ బాబు, మాజీ సర్పంచ్ నారాయణ గౌడ్, టీడీపీ శాశ్వత సభ్యులు సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ రామకృష్ణ, సీనియర్ నాయకులు రవీంద్ర రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు, యూనిట్ ఇన్చార్జ్లు, బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. క్లస్టర్–08లో మహానాడు విజయవంతంగా నిర్వహించడంపై స్థానిక నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.




