Hindupur: హిందూపురంలో బాలయ్య మార్క్.. పోలీసుల కోసం అదిరిపోయే గిఫ్ట్!
Hindupur: హిందూపురం పోలీసులకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కానుక. 15 లక్షల విలువైన 7 రక్షక్ వాహనాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్.
Hindupur: హిందూపురంలో బాలయ్య మార్క్.. పోలీసుల కోసం అదిరిపోయే గిఫ్ట్!
శ్రీ సత్యసాయి: హిందూపురం నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యవసర పరిస్థితులలో రక్షక వాహనాలు ఎంతో దోహదపడతాయని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ అన్నారు. పోలీసులకు సహాయం అందించేలా, పోలీసు స్టేషన్లలో సిబ్బంది మొబిలిటీ పెంచేలా కొత్త రక్షక్ వాహనాలను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చొరవ చూపి అందజేయడం పై జిల్లా ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు.
హిందూపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సి ఎస్ ఆర్ ఫండింగ్ కింద రూ.15 లక్షల విలువైన 7 రక్షక్ వాహనాలకు సంబంధించి ఎస్పీ సమక్షంలో పోలీసు శాఖకు తాళాలను ఎమ్మెల్యే బాలకృష్ణ సహాయ కార్యదర్శులు వీరయ్య, సురేంద్ర అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ, వాహనాలకు పూజ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసుల తక్షణమే స్పందించేందుకు, రాత్రి పహారా బలోపేతానికి రక్షక్ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అత్యవసర కాల్స్ వచ్చినప్పుడు పోలీసులు వీలైనంత త్వరగా స్పందించి ఘటనా స్థలాలకు చేరుకునేందుకు శాంతి భద్రతలను కాపాడేందుకు ఈ రక్షక్ వాహనాల రాకతో సులభతరం అయిందన్నారు.
ఇప్పటికే మూడు బొలెరో వాహనాలు పోలీసు శాఖకు అందాయని, ప్రస్తుతం ఈ వాహనాల రాకతో మొత్తం 10 వాహనాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. సున్నితమైన నియోజకవర్గంలో పోలీసులు ఏవైనా ఘటనలు జరిగినప్పుడు తక్షణమే స్పందించేందుకు అవకాశం దొరుకుతుందన్నారు. డిఎస్పి కేవీ మహేష్ ఆధ్వర్యంలో ఆయా పోలీసు స్టేషన్ల సిబ్బంది ఈ వాహన సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు డీఎస్పీ కేవీ మహేష్, సి ఐ లు ఆంజనేయులు, కరీం, ఎస్సైలు రాజేష్, లింగన్న, శ్రీధర్ నాగ ప్రసన్న, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




