OD Cheruvu: రైతులకు తీపి కబురు మీ ఆస్తి మీకే! ఎమ్మెల్యే సింధూర రెడ్డి
OD Cheruvu: శ్రీ సత్యసాయి జిల్లా ఓడి చెరువులో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి.
OD Cheruvu: రైతులకు తీపి కబురు మీ ఆస్తి మీకే! ఎమ్మెల్యే సింధూర రెడ్డి
OD చెరువు: మన పూర్వీకుల ఆస్తి వారి వారసత్వానికే చెందాలన్న ఉద్దేశ్యమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. ఓ,డి చెరువు మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల భూ హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు వారసత్వ ఆస్తులపై పూర్తి హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాలేదని విమర్శించారు. అయితే ప్రతి కుటుంబంపై సుమారు రూ.8 లక్షల అప్పు మోపారని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో రూ.1 లక్షా 51 వేల 700 కోట్ల భారీ పెట్టుబడులతో ఏరోనాటికల్ డిఫెన్స్ అకాడమీ, రిలయన్స్ సోలార్ భారీ విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. ఈ పరిశ్రమల ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు పుట్టపర్తి నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని పేర్కొన్నారు.
మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు భూ పత్రాల పంపిణీ ద్వారా వారి హక్కులను ప్రభుత్వం బలోపేతం చేస్తోందన్నారు. అభివృద్ధి, పరిశ్రమలు, ఉపాధి సృష్టి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ మండల కన్వీనర్ జయచంద్ర, మాజీ జెడ్పీటీసీ పిట్టా ఓబుల్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు తుమ్మల మహబూబ్ బాషా, శివారెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నిజాం , కంచి సురేష్, జీ.వి ఆదినారాయణ, జౌళి బాబా, బోరు రమణ, షాను, రెవెన్యూ అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




