Anantapur: దళిత ద్రోహి జగన్ వాల్ పోస్టర్లు విడుదల చేసిన ఎమ్మెల్యే!
Anantapur: వైసీపీ ఐదేళ్ల పాలనలో దళితులపై జరిగిన అరాచకాలను ఎండగడుతూ అనంతపురంలో టీడీపీ వాల్ పోస్టర్లను విడుదల చేసింది.
Anantapur: దళిత ద్రోహి జగన్ వాల్ పోస్టర్లు విడుదల చేసిన ఎమ్మెల్యే!
Anantapur: వైసీపీ హయాంలో దాదాపు 11వేల ఎకరాల దళిత భూములను అక్రమంగా లాక్కున్నారని టిడిపి ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు మండిపడ్డారు అనంతపురంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితులపై అత్యాచారాలు అఘాయిత్యాలు అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. జగన్ హయంలో 437 మంది మహిళలపై అత్యాచారాలు, దాదాపు 6000 మంది పై అక్రమ కేసులు,
దాదాపు 200 నుంచి 250 మంది దళితుల హత్యలు ఆత్మహత్యలు జరిగాయని నిప్పులు చెరిగారు ఇవన్నీ పార్లమెంట్ సాక్షిగా వెలువడిన నిజాలని చెప్పారు. డాక్టర్ సుధాకర్, ఓం ప్రకాష్, సుబ్రహ్మణ్యం, విక్రం, ఇలా ఎంతోమంది దళితులను పొట్టన పెట్టుకున్న పార్టీ వైసిపి అని ఎద్దేవా చేశారు. దళితల బాంధవుడు చంద్రబాబు అయితే దళితుల యముడు జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. ఇవాళ దళితులకు సీఎం చంద్రబాబు ఉపాధి అవకాశాలు.. ఉన్నత చదువులకు కృషి చేస్తున్నారని కొనియాడారు.




