Anantapur: మొహర్రం వేడుకల్లో అద్భుత ఘట్టం ముగిసిన చిన్న పీర్ల సవారీలు!
Anantapur: పాతూరులో చిన్న పీర్ల పండుగ వేడుకలు వైభవంగా ముగిశాయి 10వ రోజు పీర్ల అగ్నిగుండ ప్రవేశం మెయిన్ బజార్‌లో సలాం చేసుకునే ఘట్టాలను చూసేందుకు భక్తులు వచ్చారు
Anantapur: మొహర్రం వేడుకల్లో అద్భుత ఘట్టం ముగిసిన చిన్న పీర్ల సవారీలు!
అనంతపురం: పట్టణంలోని పాతూరు ప్రాంతంలో చిన్న పీర్ల పండుగ సందర్భంగా 10వ రోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు మకాణాల వద్ద పీర్లకు సంప్రదాయబద్ధంగా అగ్నిగుండ ప్రవేశం నిర్వహించగా, వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో వీక్షించారు.
పీర్లను కొత్త వస్త్రాలు, నగలు, పూలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి నుంచి ఉదయం వరకు భక్తులకు దర్శన భాగ్యం కల్పించడంతో పాటు పానకాలు పంపిణీ, మొక్కుల చెల్లింపుల కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగాయి.
ఉదయం సవారీ కార్యక్రమానికి ముందు అగ్నిగుండ ప్రవేశం నిర్వహించగా, అనంతరం మెయిన్ బజార్‌లో వివిధ మకాణాల పీర్లు పరస్పరం "సలాం" చేసుకున్నాయి. ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొని భక్తి భావంతో ప్రార్థనలు చేశారు. పాతూరు ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది ఈరోజు సాయింత్రం పాత ఊరు చిన్న మొహరం కార్యక్రమాలు అన్ని ముగింపు కావడం జరుగుతుందని మఖానాల కార్యనిర్వకులు తెలిపారు.




