Anantapur: అనంతపురం జిల్లాలో వైభవంగా ప్రారంభమైన చిన్న పీర్ల పండుగ
Anantapur: అనంతపురం జిల్లా వ్యాప్తంగా చిన్న పీర్ల పండుగ వేడుకలు ప్రారంభం. పీర్ల చావడి వద్ద భక్తుల ప్రత్యేక ప్రార్థనలు, చక్కెర చదివింపులు.
Anantapur: అనంతపురం జిల్లాలో వైభవంగా ప్రారంభమైన చిన్న పీర్ల పండుగ
అనంతపురం: అనంతపురం జిల్లా వ్యాప్తంగా మొహర్రం (పీర్ల పండుగ) వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో సాగుతున్నాయి. నిన్నటితో పెద్ద పీర్ల పండుగ ముగియగా... ఈరోజు నుండి జిల్లావ్యాప్తంగా ‘చిన్న పీర్ల పండుగ’ అట్టహాసంగా ప్రారంభమైంది.
పీర్ల చావడి వద్ద భక్తుల సందడి
పండుగ ప్రారంభం కావడంతో అనంతపురం పట్టణంలోని పీర్ల చావడి నందు పీర్ల పెట్టె ఊరేగింపు (మెరవణి) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకను చూసేందుకు అనంతపురం నగర ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
చావడి వద్ద భక్తులందరూ ప్రత్యేక ప్రార్థనలు చేసి, భక్తిశ్రద్ధలతో ‘చక్కెర చదివింపులు’ సమర్పించారు.ఈ పీర్ల పండుగ వేడుకలు ఈ రోజు నుండి వరుసగా పది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటామని పీర్ల చావడి కార్యనిర్వాహకులు తెలిపారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఈ వేడుకల్లో పాల్గొంటున్నారని వారు పేర్కొన్నారు.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో హసేన్, హుసేన్ మకానం కమిటీ సభ్యురాలు ఆసీపమ్మగారు, చిట్టి అసోసియేషన్ ప్రతినిధులు, ఫారూఖ్ మిత్ర బృందం సభ్యులు మరియు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్ర




