kadiri: కాలసముద్రంలో అంగరంగ వైభవంగా మొహరం వేడుకలు!

kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కాలసముద్రం గ్రామంలో మొహరం వేడుకలు ఘనంగా ప్రారంభం.

P.RAHAMTULLA, KADIRI
Published on: 26 Jun 2026 9:45 AM IST
kadiri
X

kadiri: కాలసముద్రంలో అంగరంగ వైభవంగా మొహరం వేడుకలు!

kadiri: సత్యసాయి జిల్లాలో మొహరం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కదిరి మండలం కాలసముద్రం గ్రామంలో గురువారం రాత్రి నుండి మొహరం వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

గురువారం రాత్రి మొదటి పీరు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు పీరు కు సంబంధించిన వంశస్థులు. వివిధ రకాల పూలతో అలంకరించిన పీరును గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో గ్రామంలో ఊరేగించారు.

ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story