Anantapur: రేయ్.. బండి పక్కన పెట్టు! రోడ్డుకు అడ్డంగా వాహనం పెడితే ఎలా?

Anantapur: అనంతపురం నగర వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ రోడ్డుపై అడ్డంగా వాహనం నిలిపిన తన సొంత డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి ఆదర్శంగా నిలిచారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Updated on: 22 Oct 2026 4:53 PM IST
Anantapur
X

Anantapur: రేయ్.. బండి పక్కన పెట్టు! రోడ్డుకు అడ్డంగా వాహనం పెడితే ఎలా?

అనంతపురం: అనంతపురం నగర వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.సాధారణంగా ప్రజలతో కలివిడిగా మాట్లాడే రమేష్ గౌడ్.. తన డ్రైవర్ తీరుపై ఒక్కసారిగా సీరియస్ అయ్యారు.గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డు పక్కన ఉన్న ఓ టీ కొట్టు వద్ద ఆయన టీ తాగుతూ ప్రజలతో ముచ్చటిస్తున్నారు.అయితే, అదే సమయంలో ఆయన డ్రైవర్ వాహనాన్ని రోడ్డుపైనే నిలిపాడు.

రోడ్డుకు అడ్డంగా వాహనం నిలిపిన విషయాన్ని గమనించిన రమేష్ గౌడ్.. వెంటనే "రేయ్.. బండి పక్కన పెట్టు!" అంటూ డ్రైవర్‌ను హెచ్చరించారు.అనంతరం వాహనాన్ని పక్కకు తీసుకెళ్లిన డ్రైవర్‌తో మాట్లాడుతూ.. "మనమే రోడ్డుకు అడ్డంగా కారు నిలిపితే ఎలా? ట్రాఫిక్ సమస్య పరిష్కారం మన ఎన్నికల హామీల్లో ఒకటి. ఈ ఊరివాళ్లమే.. మనం కూడా సామాన్యులమే. ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా మసులుకోవాలి" అంటూ సూచించారు. తమకు హామీ ఇచ్చిన సమస్యను తామే పాటించకపోతే ఎలా అని రమేష్ గౌడ్ ప్రశ్నించిన తీరు అక్కడున్న వారిని ఆకట్టుకుంది.

ఈ ఘటనతో టీ కొట్టు వద్ద ఉన్న ప్రజలు ఆయన వ్యవహారశైలిపై స్పందించారు.అనంతరం రమేష్ గౌడ్ స్థానిక ప్రజలతో పలు సమస్యలపై చర్చించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.ఎన్నికల ప్రచారంలో హామీలు ఇవ్వడమే కాదు.. వాటిని మనమే ఆచరించాలనే సందేశాన్ని ఈ ఘటన ద్వారా రమేష్ గౌడ్ ఇచ్చారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM