Gooty: గుత్తి గురుకుల బాలికల పాఠశాలను తనిఖీ చేసిన ఎంపీడీఓ

Gooty: గుత్తి ఏపీ గురుకుల బాలికల పాఠశాలను ఎంపీడీఓ ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థుల భోజనం, పరిశుభ్రతపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 29 July 2026 8:06 PM IST
Gooty
X

Gooty: గుత్తి గురుకుల బాలికల పాఠశాలను తనిఖీ చేసిన ఎంపీడీఓ

గుత్తి గురుకుల బాలికల (APRS ) పాఠశాలను తనిఖీ చేసిన ఎంపీడీఓ ప్రభాకర్

- పరిశుభ్రత, భోజనం, విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

అనంతపురం జిల్లా గుత్తి ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయం, బాలికల గుత్తి పాఠశాల ను మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రభాకర్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పాఠశాల పరిసర ప్రాంతాలను, తరగతి గదులను, వసతి గృహాలను పరిశీలించిన ఎంపీడీఓ, ప్రభాకర్ పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

అలాగే విద్యార్థులకు పౌష్టికమైన, అందమైన భోజనం అందించాలని, వారి ఆరోగ్యం, చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పాఠశాల ప్రిన్సిపాల్ స్వాతి తో పాటు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని, అందుకు అనుగుణంగా అందరూ బాధ్యతగా పనిచేయాలని ఎంపీడీఓ ప్రభాకర్ పేర్కొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story