Anantapur: అనంతపురంలో ప్రారంభమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల పర్వం!
Anantapur: అనంతపురం జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. జడ్పీ కార్యాలయం వద్ద డ్రోన్లు, భారీ పోలీసు బందోబస్తుతో ఎస్పీ జగదీష్ నిఘా పర్యవేక్షిస్తున్నారు.
Anantapur: అనంతపురంలో ప్రారంభమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల పర్వం!
Anantapur: అనంతపురం జిల్లాలో నేటి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ జరగనుంది.నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జడ్పీ కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలో కంచెలు ఏర్పాటు చేసి, భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు.అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా బందోబస్తును జిల్లా ఎస్పీ జగదీష్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.నేటి నుంచి మూడు రోజుల పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.




