Anantapur: నాయక్ నగర్‌లో వైసీపీ కార్యకర్తలపై దాడి: పోలీసులకు అల్టిమేటం!

Anantapur: అనంతపురం 39వ డివిజన్ నాయక్ నగర్‌లో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడి చేశారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 22 Oct 2026 10:41 PM IST
Anantapur
X

Anantapur: నాయక్ నగర్‌లో వైసీపీ కార్యకర్తలపై దాడి: పోలీసులకు అల్టిమేటం!

అనంతపురం: అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల వేళ నాయక్ నగర్ కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.నగరంలోని 39వ డివిజన్ పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.ఎన్నికల ప్రచారం ముగించుకుని కార్యకర్తలు ఓ హోటల్‌లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాధితులు తెలిపారు.నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం కూటమి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తమ తమ డివిజన్లలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో 39వ డివిజన్ వైసీపీ అభ్యర్థి సాకే చంద్రకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు వైసీపీ వర్గాలు ఆరోపించాయి.టీడీపీకి చెందిన మాజీ డిప్యూటీ మేయర్ గంపన్న వర్గీయులే ఈ దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు.ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేకనే తమపై దాడి చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన సమయంలోనూ దాడి జరిగే ప్రమాదం ఉందని పోలీసుల నుంచి ముందస్తు సమాచారం అందడంతో నామినేషన్ దాఖలు చేయకుండా వెనుదిరిగినట్లు వైసీపీ నాయకులు పేర్కొన్నారు.

అదే కక్షతో మరోసారి తమ కార్యకర్తలు ఆనంద్ బాబు శ్రీకాంత్ లపై దాడి చేశారని ఆరోపించారు.ఈ ఘటనపై స్పందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి వైయస్సార్సీపి మేర అభ్యర్థి బీసీ రమేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల వేళ తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనపై పోలీసుల దాడికి పాల్పడిన వారి పైన కేసులో నమోదు చేసి వారికి శిక్షలు పడేలా చేయాలని లేని పక్షంలో పోలీసుల కార్యాలయాల వద్ద ధర్నాకు దిగుతామని తెలియజేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM