Pamidi: పామిడిలో తేలిన పంచాయతీ గందరగోళం: ఎంపிடీఓ కీలక ప్రకటన!

Pamidi: అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో మున్సిపాలిటీనా లేక పంచాయతీనా అనే దానిపై నెలకొన్న అయోమయం. స్పష్టతనిచ్చిన ఎంపிடీఓ ప్రభాకర్.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 22 Aug 2026 12:18 PM IST
Pamidi
X

Pamidi: పామిడిలో తేలిన పంచాయతీ గందరగోళం: ఎంపிடీఓ కీలక ప్రకటన!

Pamidi: అనంతపురం జిల్లా పామిడి పట్టణ పాలన అయోమయంగా మారింది. ఇది మున్సిపాలిటీనా లేక గ్రామ పంచాయతీనా అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేక పట్టణ ప్రజలు ఇటు సర్పంచా, అటు చైర్మన్ ఎవరూ లేకుండా ఎదురుచూస్తున్నారు.

2009-2014 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పామిడికి మున్సిపాలిటీ హోదా కల్పించారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో చైర్మన్ గా గౌస్ పీరా ఎన్నికయ్యారు.

అనంతరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆస్తి పన్ను, ఇతర పన్నుల భారం ఎక్కువ పడుతుందనే ఉద్దేశంతో పామిడిని తిరిగి అప్ గ్రేడ్ గ్రామ పంచాయతీగా మార్చింది. అప్పటి నుండి గత ఐదేళ్లు ఎటువంటి ఎన్నికలు నిర్వహించకుండా అధికారి పాలనతోనే కొనసాగించింది.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చినా అదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రత్యేక అధికారి పాలనలోనే పామిడి పట్టణం ఉంది. ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ అన్నీ కుంటుపడ్డాయి. సమస్యలు వినే నాథుడే లేకుండా పోయారని ప్రజలు వాపోతున్నారు.

పామిడిని తిరిగి మున్సిపాలిటీగా కొనసాగిస్తారా లేక పంచాయతీగానే ఉంచుతారా అనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఒకవేళ పంచాయతీగానే కొనసాగిస్తే ఈసారైనా సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయా అనే అనుమానాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు నిర్వహించి ప్రజా పాలన తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

అధికారి వివరణ:

ఈ విషయంపై పామిడి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) డి. ప్రభాకర్ ను వివరణ కోరగా "రాబోవు స్థానిక సంస్థ ఎన్నికల్లో పామిడి గ్రామ పంచాయతీగానే పరిగణించి సర్పంచ్ మరియు ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి" అని స్పష్టం చేశారు.

దీంతో పామిడి ప్రజల్లో కొంత స్పష్టత వచ్చినప్పటికీ, త్వరగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి ప్రజా ప్రతినిధుల పాలన తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story