Kadiri: కదిరిలో వైయస్సార్‌సీపీకి షాక్ టీడీపీలోకి ముస్లిం మైనార్టీలు!

Kadiri: సత్యసాయి జిల్లా కదిరిలో 23వ వార్డుకు చెందిన 20 ముస్లిం మైనార్టీ కుటుంబాలు వైసీపీని వీడి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరాయి.

P.RAHAMTULLA, KADIRI
Published on: 5 Oct 2026 1:01 PM IST
Kadiri
X

Kadiri: కదిరిలో వైయస్సార్‌సీపీకి షాక్ టీడీపీలోకి ముస్లిం మైనార్టీలు!

Kadiri: సత్యసాయి జిల్లా కదిరిలో ఎమ్మెల్యే కార్యాలయంలో 23వ వార్డుకు చెందిన 20 ముస్లిం మైనార్టీ కుటుంబాలు వైసీపీని వీడి, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నామని, పాత, కొత్త నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. గతంలో పార్టీ బలంగా లేని ప్రాంతాల నుంచి కూడా పెద్దఎత్తున చేరికలు జరుగుతుండటం పార్టీ బలోపేతానికి నిదర్శనమన్నారు.

అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతున్నామని, ముస్లిం మైనార్టీలతో పాటు ప్రతి వర్గానికి సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI