Anantapur: ఉపాధ్యాయులకు తిరిగి గౌరవం తెచ్చింది లోకేషే: ఎమ్మెల్యే దగ్గుపాటి!

Anantapur: గత ఐదేళ్లలో అవమానాలకు గురైన ఉపాధ్యాయులకు మంత్రి నారా లోకేష్ తిరిగి గౌరవాన్ని తెచ్చిపెట్టారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 5 Sept 2026 4:50 PM IST
Anantapur
X

Anantapur: ఉపాధ్యాయులకు తిరిగి గౌరవం తెచ్చింది లోకేషే: ఎమ్మెల్యే దగ్గుపాటి!

అనంతపురం: గత ఐదేళ్లలో ఉపాధ్యాయులు అవమానాలకు గురైతే.. వారికి తిరిగి గౌరవాన్ని గుర్తింపును తెచ్చింది.. మంత్రి నారా లోకేష్ అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ఆయన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తో కలిసి పాల్గొన్నారు.

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 64మంది ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయుడిగా పని చేసిన చరిత్ర ఆర్ట్స్ కళాశాలకు ఉందన్నారు. అలాంటి చోట గురుపూజోత్సవంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు.

గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులను వైన్ షాపుల వద్ద కాపాలాగా ఉంచడం, బాత్ రూంల ఫోటోలు తీసి పంపేలా అవమానిస్తే.. తిరిగి వారికి తగిన గుర్తింపు తెచ్చేలా మంత్రి నారా లోకేష్ చేశారన్నారు. రాష్ట్రంలో మెగా డీఎస్సీ ద్వారా 16347పోస్టులు భర్తీ చేయడంతో పాటు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చారన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేలా పని చేయాలని.. వారికి ప్రభుత్వ సహకారం ఎప్పటికీ ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story