Guntakal: గుంతకల్లులో నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఉచిత వైద్య శిబిరం!
Guntakal: గుంతకల్లు పట్టణంలోని మోదీనాబాద్ పై కొట్టాల వద్ద నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మదర్స్ డే సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
Guntakal: గుంతకల్లులో నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఉచిత వైద్య శిబిరం!
గుంతకల్: పేద తల్లులకు మదర్స్ డే కానుకగా ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు గుంతకల్ పట్టణం లో నారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మదర్స్ డే సందర్భంగా పట్టణంలోని మోదీనాబాద్ పై కొట్టాల నందు జరిగింది ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పేద ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, చిన్న చికిత్సలు, మౌలిక ఆరోగ్య సలహాలతో పాటు కొన్ని ప్రత్యేక విభాగాల్లో (ఉదా: స్త్రీ రోగ విభాగం, శిశు ఆరోగ్యం, డయాబెటిస్, బీపీ వంటివి) ఉచిత స్క్రీనింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉంచారు.
ఈ కార్యక్రమం ద్వారా బలహీన విభాగాలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను నిరుపేద తల్లులకు మదర్స్ డే కానుకగా అందించడం జరిగింది. శిబిరంలో పాల్గొన్న ట్రస్ట్ వైద్య బృందం గ్రామీణ మహిళలు “పట్టణం నుండి పెద్ద ఆసుపత్రికి వెళ్లడం కష్టం ప్రతీ సారి డబ్బు ఖర్చు అవుతుంటుంది; ఇలాంటి ఉచిత శిబిరాలు మాకు బాగా ఉపయోగపడుతున్నాయి” అని తెలిపారు.
నారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మాట్లాడిన ట్రస్ట్ అధ్యక్షులు అధికారి మాట్లాడుతూ, నారాయణ నాయక్ “మదర్స్ డే స్పెషల్ ఐడియా కానీ, ప్రతి ఆదివారం పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు, ఆరోగ్య చైతన్యం కలిగించే కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ రకమైన శిబిరాలు మరింత పెంచే దిశగా ట్రస్ట్ ప్లాన్ చేస్తోంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుర్రం సూర్యనారాయణ వనగొంది విజయలక్ష్మి పద్మ జీవిత జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




