Obuladevaracheruvu: నీట్ పీజీలో ఈశ్వర్ రెడ్డికి జాతీయ స్థాయిలో 361వ ర్యాంక్
Obuladevaracheruvu: శ్రీ సత్యసాయి జిల్లా ఓడీ చెరువు మండలం వేమారెడ్డిపల్లికి చెందిన డాక్టర్ మలక ఈశ్వర్ రెడ్డి నీట్ పీజీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 361వ ర్యాంక్ సాధించారు.
Obuladevaracheruvu: నీట్ పీజీలో ఈశ్వర్ రెడ్డికి జాతీయ స్థాయిలో 361వ ర్యాంక్
ఓబులదేవరచెరువు: నీట్ పీజీ (NEET PG) ఫలితాల్లో వేమారెడ్డిపల్లికి చెందిన డాక్టర్ మలక ఈశ్వర్ రెడ్డి అఖిల భారత స్థాయిలో 361వ ర్యాంక్ సాధించారు. జాతీయ స్థాయి వైద్య ప్రవేశ పరీక్షలో అత్యుత్తమ ర్యాంక్ సాధించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు.
మలక చిదంబ రెడ్డి, సునందమ్మ దంపతుల కుమారుడైన ఈశ్వర్ రెడ్డి దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పీజీ పోటీ పరీక్షలో ప్రతిభ కనబరిచారు. సాధించిన ర్యాంక్‌తో ప్రముఖ వైద్య కళాశాలలో పీజీ జనరల్ మెడిసిన్ అభ్యసించే అవకాశం లభించనుంది.
ఈ సందర్భంగా డాక్టర్ ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తన విజయానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వం, నిరంతర కృషి కారణమని తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయి వైద్యుడిగా ఎదిగి, సమాజానికి నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
జాతీయ స్థాయిలో 361వ ర్యాంక్ సాధించి వేమారెడ్డిపల్లి గ్రామానికి, కుటుంబానికి మంచి పేరు తీసుకువచ్చిన డాక్టర్ మలక ఈశ్వర్ రెడ్డిని కుటుంబ సభ్యులు, గ్రామ ప్రముఖులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.




