Anantapur: గుత్తిలో కొత్త పోలీస్ పెట్రోల్ బంక్.. భూమి పూజ చేసిన ఎస్పీ జగదీష్!
Anantapur: అనంతపురం జిల్లా గుత్తిలో రూ.95 లక్షలతో పోలీస్ పెట్రోల్ బంక్ నిర్మాణం. భూమి పూజ చేసిన ఎస్పీ జగదీష్.
Anantapur: గుత్తిలో కొత్త పోలీస్ పెట్రోల్ బంక్.. భూమి పూజ చేసిన ఎస్పీ జగదీష్!
అనంతపురం జిల్లా: గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రూ.95 లక్షల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ నిర్మాణానికి జిల్లా ఎస్పీ జగదీష్ సోమవారం భూమి పూజ చేశారు. ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ.. జిల్లాలో పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.BPCL భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తున్నామని చెప్పారు.
ఈ బంక్ పోలీస్ వాహనాలకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుందని, నాణ్యమైన ఇంధనం అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పోలీస్ వాహనాలకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సమయం ఆదా అవుతుందని తెలిపారు.
విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి ఇంధనం అత్యవసరమని, ఈ బంక్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే అవకాశం కలుగుతుందని అన్నారు. నిర్మాణ పనులు సకాలంలో, నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.




