Kadiri: కదిరి చర్చ్ పాస్టర్లకు నిసార్ యాసిన్ ఖాన్ భరోసా!

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో చర్చ్ పాస్టర్లకు SIMS హాస్పిటల్ MD నిసార్ యాసిన్ ఖాన్ 73 హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. రూ.5 లక్షల సంక్షేమ నిధి ప్రకటించారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 11 Nov 2026 9:18 AM IST
Kadiri
X

Kadiri: కదిరి చర్చ్ పాస్టర్లకు నిసార్ యాసిన్ ఖాన్ భరోసా!

Kadiri: సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చర్చ్ పాస్టర్ల సంక్షేమం, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించే దిశగా సిమ్స్ హాస్పిటల్ ఎండీ, NYPSN ఫౌండర్ నిసార్ యాసిన్ ఖాన్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

కదిరి పట్టణంలోని ఎల్‌ఐసీ కార్యాలయం పక్కన ఉన్న C & IGM తెలుగు ఇమ్మానియేల్ చర్చ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చర్చ్ పాస్టర్ల సంక్షేమం కోసం రూ.5 లక్షల సంక్షేమ నిధిని నిసార్ యాసిన్ ఖాన్ ప్రకటించారు.

ఈ సందర్భంగా మొత్తం 73 హెల్త్ కార్డులను పాస్టర్లకు పంపిణీ చేశారు. ఈ కార్డుల ద్వారా పాస్టర్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య భద్రత కల్పించనున్నారు.

అంతేకాకుండా హెల్త్ కార్డు పొందిన ప్రతి కార్డుదారునికి ప్రత్యేక సంక్షేమ ప్రయోజనాలు వర్తిస్తాయని నిసార్ యాసిన్ ఖాన్ తెలిపారు. కార్డుదారుల కుటుంబాల్లో వివాహాలు జరిగినప్పుడు రూ.20,000 ఆర్థిక సహాయం, కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి అంత్యక్రియల సహాయంగా రూ.10,000 అందిస్తామని ప్రకటించారు.

ఈ విధంగా ఆరోగ్య భద్రతతో పాటు కుటుంబాల్లో శుభకార్యాలు, కష్టసమయాల్లోనూ ఆర్థికంగా అండగా నిలిచేలా హెల్త్ కార్డు ద్వారా పలు సంక్షేమ ప్రయోజనాలు కల్పించనున్నారు.

సమాజంలో ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న చర్చ్ పాస్టర్లకు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య మరియు ఆర్థిక భరోసా కల్పించేలా నిసార్ యాసిన్ ఖాన్ చేపట్టిన ఈ కార్యక్రమంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI