Anantapur: బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెడితే చర్యలు.. కలెక్టర్ హెచ్చరిక!

Anantapur: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 27 April 2026 1:09 PM IST
Anantapur
X

Anantapur: బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెడితే చర్యలు.. కలెక్టర్ హెచ్చరిక!

Anantapur: కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రెస్ మీట్ నిర్వహించారు. జిల్లాలో ఎక్కడా పెట్రోల్, డీజల్ కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సామాజిక మాధ్యమాల్లో పెట్రోల్, డీజల్ కొరత ఉందని తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపారు. ఆ ప్రచారం కారణంగా ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్దకు రావడంతో కొన్నిచోట్ల తాత్కాలిక సమస్య ఏర్పడిందన్నారు. అయితే జిల్లాలో అన్ని ప్రాంతాల్లో సరిపడా పెట్రోల్, డీజల్ నిల్వలు ఉన్నాయని చెప్పారు.కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా పెట్రోల్ బంక్ యాజమాన్యం స్టాక్ ఉండి కూడా ఇవ్వకుండా నిలిపివేస్తే సంబంధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిన్న ఒక్కసారిగా వాహనదారులు రావడంతో కొన్నిచోట్ల స్టాక్ అయిపోయిందని, ఆ బంకులకు ఈరోజు సాయంత్రం లోపు సరఫరా పూర్తవుతుందని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా సహకరించాలని కోరారు. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో జిల్లాలో పెట్రోల్, డీజల్ నిల్వల వివరాలను నిరంతరం సేకరిస్తున్నామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story