Anantapur: అనంతలో నీట్ సెగ.. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం!
Anantapur: అనంతపురంలో నీట్ పేపర్ లీకేజీపై NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు.
Anantapur: అనంతలో నీట్ సెగ.. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం!
అనంతపూర్: అనంతపురంలో నీట్ పేపర్ లీకేజీ ఘటనపై భారత జాతీయ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యాలయం నుంచి సప్తగిరి సర్కిల్ వరకు దిష్టిబొమ్మతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సప్తగిరి కూడలిలో దిష్టిబొమ్మ దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దేశంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉంటూ ప్రజలను మోసం చేస్తున్నారని నరేష్ విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడారని మండిపడ్డారు.
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.




