Sri Sathya Sai: అప్రకటిత విద్యుత్ కోతలపై రైతుల ధర్నా!

Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా ఓ.డి.చెరువు మండలం కొండకమర్ల సబ్‌స్టేషన్ వద్ద అప్రకటిత విద్యుత్ కోతలపై రైతులు ధర్నా. అధికారుల హామీతో ఆందోళన విరమణ.

S.Firoz, Sri Sathya Sai
Published on: 8 Sept 2026 1:42 PM IST
Sri Sathya Sai
X

Sri Sathya Sai: అప్రకటిత విద్యుత్ కోతలపై రైతుల ధర్నా!

Sri Sathya Sai: మండలంలోని కొండకమర్ల సబ్‌స్టేషన్‌ వద్ద అప్రకటిత విద్యుత్‌ కోతలను నిరసిస్తూ రైతులు ధర్నా నిర్వహించారు. రైతుల ఆందోళనకు స్థానిక వైసీపీ నాయకులు సంఘీభావం తెలిపారు.

గత 15 రోజులుగా తరచూ విద్యుత్‌ కోతలు విధిస్తుండటంతో తాగునీటితో పాటు పంట పొలాలకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు. సమస్యను పలుమార్లు విద్యుత్‌ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో కురవకపోవడంతో బోరుబావుల్లో పరిమితంగా ఉన్న నీటితో పంటలను కాపాడుకుంటున్నామని, దీనికి తోడు విద్యుత్‌ కోతలు విధించడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు పేర్కొన్నారు.

తమ సమస్యను పరిష్కరించే వరకు ధర్నా విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న విద్యుత్‌ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. విద్యుత్‌ సరఫరాలో నెలకొన్న సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.

S.Firoz, Sri Sathya Sai

S.Firoz, Sri Sathya Sai

Next Story