OD Cheruvu: ఓ.డి.చెరువులో తృటిలో తప్పిన ముప్పు

OD Cheruvu: హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో అదుపుతప్పి మూడు పల్టీలు కొట్టిన కారు.. డ్రైవర్ క్షేమంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు.

S.Firoz, Sri Sathya Sai
Published on: 1 Jun 2026 2:06 PM IST
OD Cheruvu
X

OD Cheruvu: ఓ.డి.చెరువులో తృటిలో తప్పిన ముప్పు

ఓ.డి.చెరువు: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. హెచ్పి పెట్రోల్ బంక్ వెనుక భాగంలో జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి మూడు పల్టీలు కొట్టింది. సమాచారం మేరకు, ప్రమాద సమయంలో కారులో డ్రైవర్ ఒక్కరే ఉన్నారు. కారు పల్టీలు కొట్టడంతో వాహనం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ, డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడం విశేషం.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద తీవ్రతను చూసిన వారంతా డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ రహదారిపై వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని స్థానికులు సూచిస్తున్నారు.

S.Firoz, Sri Sathya Sai

S.Firoz, Sri Sathya Sai

Next Story