O.D. Cheruvu: ఓ.డి. చెరువు 'షైనింగ్ స్టార్స్'కు వశిష్ట విద్యార్థులు
O.D. Cheruvu: ఓ.డి. చెరువు వశిష్ట స్కూల్ విద్యార్థులు నిఖిల, చేతన్‌లకు రాష్ట్ర ప్రభుత్వ 'షైనింగ్ స్టార్స్' పురస్కారం. ఒక్కో విద్యార్థికి రూ. 20 వేల నగదు ప్రోత్సాహకం.
O.D. Cheruvu: ఓ.డి. చెరువు 'షైనింగ్ స్టార్స్'కు వశిష్ట విద్యార్థులు
ఓ.డి. చెరువు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న "షైనింగ్ స్టార్స్" పురస్కారానికి శ్రీ సత్యసాయి జిల్లా ఓ.డి. చెరువు మండల కేంద్రంలోని వశిష్ట ఇంగ్లీష్ మీడియం స్కూల్కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు.
2025–26 విద్యా సంవత్సరంలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన లింగాల నిఖిల (ID No. 2626121864), ఎం. చేతన్ (ID No. 2626121988) షైనింగ్ స్టార్స్ అవార్డుకు ఎంపిక కావడం పట్ల పాఠశాల కరస్పాండెంట్ పిట్ట శివశంకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ పార్థసారథి రెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. ప్రభుత్వం షైనింగ్ స్టార్ అవార్డుతో పాటు ఒక్కో విద్యార్థికి రూ.20 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందించడం ఆనందదాయకమని తెలిపారు.
పాఠశాల స్థాపించిన నాటి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో తమ విద్యార్థులు ప్రతిభ కనబరుస్తూ పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకొస్తున్నారని కరస్పాండెంట్ పేర్కొన్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్న ఉపాధ్యాయ బృందం కృషి ప్రశంసనీయమని, ఈ విజయానికి కారణమైన ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.




