Guntakal: గుంతకల్లులో మిలాద్-ఉన్-నబి పీస్ కమిటీ సమావేశం!
Guntakal: గుంతకల్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మిలాద్-ఉన్-నబి ర్యాలీపై పీస్ కమిటీ సమావేశం - మత సామరస్యంతో జరుపుకోవాలని డీఎస్పీ పిలుపు!
Guntakal: గుంతకల్లులో మిలాద్-ఉన్-నబి పీస్ కమిటీ సమావేశం!
Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఈనెల 26వ తేదీన జరగనున్న మిలాద్-ఉన్-నబి పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో, అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్, IPS గారి ఆదేశాల మేరకు గుంతకల్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి గుంతకల్లు DSP A. శ్రీనివాస్ గారు హాజరై ముస్లిం సోదరులందరికీ ముందుగా మిలాద్-ఉన్-నబి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ర్యాలీ మార్గం ఇలా..
పండుగ రోజున పోర్టర్ లైన్ దర్గా నుండి ర్యాలీ ప్రారంభమై ట్రావెలర్స్ బంగ్లా సర్కిల్, DMM గేట్, అంజుమాన్ సర్కిల్, గాంధీ సర్కిల్, NTR సర్కిల్, RTC బస్టాండ్ మీదుగా మస్తానయ్య దర్గా వరకు ప్రధాన వీధుల గుండా సాగుతుందని DSP తెలిపారు.
అందరూ మత సామరస్యంతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులందరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎవరైనా కావాలని సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ర్యాలీని డ్రోన్ కెమెరాలు, సీసీటీవీలతో పూర్తిగా కవర్ చేస్తామని, ర్యాలీ సమయంలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పట్టణ ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ B. మనోహర్, కసాపురం ఎస్ఐ వెంకటస్వామి, ముస్లిం, హిందూ, క్రిస్టియన్ మత పెద్దలు పాల్గొన్నారు.




