Anantapur: అనంతపురం నగర ప్రగతికి రూ.300 కోట్లు: ఎమ్మెల్యే దగ్గుపాటి

Anantapur: అనంతపురం నగర అభివృద్ధికి రూ.300 కోట్లకు పైగా నిధులు కేటాయించామని, నెల రోజుల్లోనే రూ.200 కోట్ల పనులు ప్రారంభించామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 12 Oct 2026 3:33 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురం నగర ప్రగతికి రూ.300 కోట్లు: ఎమ్మెల్యే దగ్గుపాటి

అనంతపురం: అనంతపురం నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు.నెల రోజుల వ్యవధిలోనే రూ.200 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.

అనంతపురం నగరంలో నేడు కోటి 14 లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ శ్రీకారం చుట్టారు.పలు డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత 20 నుంచి 25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని తెలిపారు.

ఓల్డ్ టౌన్ పరిధిలో ప్రతి ఇంటికీ తాగునీటి కొళాయి కనెక్షన్ అందించేందుకు రూ.107 కోట్లతో భారీ ప్రాజెక్టును ప్రారంభించామని వెల్లడించారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో గత వారంలోనే మున్సిపాలిటీకి మరో రూ.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మంజూరయ్యాయని పేర్కొన్నారు.

కేవలం రెండేళ్లలోనే అనంతపురం నగరంలో రూ.300 కోట్లకు పైగా నిధులతో మౌలిక వసతుల సమస్యలను పరిష్కరిస్తూ నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM