Anantapur: స్థానిక ఎన్నికల్లో పద్మశాలీలకు అవకాశం కల్పించాలి: పోతుల లక్ష్మీనరసింహులు
Anantapur: అనంతపురంలో పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసిన కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల లక్ష్మీనరసింహులు.
Anantapur: స్థానిక ఎన్నికల్లో పద్మశాలీలకు అవకాశం కల్పించాలి: పోతుల లక్ష్మీనరసింహులు
Anantapur: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పద్మశాలీలకు స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పించాలని పద్మశాలి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పోతుల లక్ష్మీనరసింహులు అన్నారు అనంతపురంలోని రాచానపల్లి ప్రాంతంలో పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు కనబరిచిన పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా పోతుల లక్ష్మీనరసింహ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పద్మశాలీల జనాభా ప్రతిపాదికన రాజకీయ అవకాశం కల్పించాలన్నారు. ఇవాళ ఎంతో మంది విద్యార్థులు ఉత్తమ మార్కులు కనబరిచి అవార్డులు అందుకున్నారన్నారు విద్యారంగంలోనూ మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నామని ప్రభుత్వం పద్మశాలీలను గుర్తించి రాజకీయంగా అవకాశాలు కల్పించాలని కోరారు.
అనంతరం ఉత్తమ మార్కులు కనబరిచిన విద్యార్థులకు జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానించి, అవార్డులను అందించారు.




