Pamidi: పామిడి నూతన సీఐ బి. మనోహర్‌కు జనసేన సన్మానం
Pamidi: పామిడి నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన బి. మనోహర్‌ను జనసేన, టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
Pamidi: పామిడి నూతన సీఐ బి. మనోహర్‌కు జనసేన సన్మానం
పామిడి: అనంతపురం జిల్లా పామిడి పట్టణ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బి. మనోహర్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ పామిడి పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పామిడి మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ షావలి, జనసేన నాయకులు వసీం, పిట్టి ఖాజా, షేక్ షావలి, దాదు తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ 14వ వార్డు యువ నాయకుడు మన్సూర్ పాల్గొని నూతన సీఐకి శుభాకాంక్షలు తెలిపారు.




