Pamidi: పామిడిలో ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్ చిత్రలేఖన పోటీలు

Pamidi: పామిడిలో సేవా సంకల్ప్ అభియాన్ చిత్రలేఖన పోటీలు ఘనంగా జరిగాయి. 250 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను చాటుకున్నారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 9 Oct 2026 5:33 PM IST
Pamidi
X

Pamidi: పామిడిలో ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్ చిత్రలేఖన పోటీలు

పామిడి: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా 25 కోట్ల మంది చిన్నారుల కలలను ప్రతిబింబించే చిత్రలేఖన పోటీలను పామిడి పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యా మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానాచార్యులు సి.ఆర్. శ్రీనివాసరావు, పామిడి బీజేపీ మండల అధ్యక్షుడు చౌహాన్ అంజినాయక్ ఆధ్వర్యం వహించారు. ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఆల్ సెల్స్ కన్వీనర్, మాజీ ఆర్మీ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) కణంపల్లి చిరంజీవిరెడ్డి, అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ హాజరయ్యారు.

ఈ చిత్రలేఖన పోటీల్లో సుమారు 250 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరో, ఏడో, ఎనిమిదో తరగతుల విద్యార్థులకు ఒక విభాగంగా, తొమ్మిది, పదో తరగతుల విద్యార్థులకు మరో విభాగంగా పోటీలు నిర్వహించారు. విద్యార్థులు తమ సృజనాత్మకతను చాటుతూ వివిధ అంశాలపై ఆకట్టుకునే చిత్రాలను గీశారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

మొదటి విభాగంలో ఎం. హర్షద్ కుమార్, వై. వైష్ణవి విజేతలుగా నిలవగా, రెండో విభాగంలో పి. ఉషశ్రీ, ఎన్. జయలక్ష్మి, మహీధర్ రెడ్డి, కె.పి. ముకేష్ రెడ్డి, కరిష్మా, హిమబిందు బహుమతులు అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో గార్లదిన్నె బీజేపీ మండల అధ్యక్షుడు చాణిక్య, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మనోజ్ కుమార్, పవన్ కుమార్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యురాలు పూజారి లక్ష్మీదేవి, రాజశేఖర్ గౌడ్, ఆర్ఎస్ఎస్ పెద్దలు పుల్లా చౌడయ్య, యువ మోర్చా మండల అధ్యక్షుడు నరేంద్ర, విష్ణుకాంత్ రావు, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు నరేష్ యాదవ్, రామ్ నరేష్, శ్రీ సరస్వతి విద్యా మందిరం ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL